కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఎస్‌ఈ వేణు నేతృత్వంలో అధికారులు కొడకండ్ల రెగ్యులేటర్ నుంచి అక్కారం పంప్‌హౌజ్‌కు నీటిని వదిలారు. ఈనెల 13న తుక్కాపూర్ పంప్‌హౌజ్ నుంచి పంపింగ్ ద్వారా గజ్వేల్ మండలంలోకి ప్రవేశించిన జలాలను కొడకండ్ల శివారులోని రెగ్యులేటర్ వద్ద నిలిపివేసిన విషయం తెలిసిందే.
రెండు రోజుల పాటు అధికారులు కాలువలను పరిశీలించారు. ఈ క్రమంలో శుక్రవారం రెగ్యులేటర్ వద్ద అధికారులు పూజలు నిర్వహించి.. గేట్లు ఎత్తారు. అక్కారం పంప్‌హౌజ్ వద్ద సర్జిపూల్ నిండేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఈఈ బద్రినారాయణ, ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ