జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం సిద్దిపేట జిల్లా నుంచి కేటాయించిన సిబ్బందికి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. వివిధ శాఖలకు చెందిన 435మందిని పీవోలు, ఏపీవోలుగా నియమించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులది కీలక పాత్ర అని.. నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పీవోలు, ఏపీవోలకు సూచించారు.
ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని.. గైర్హాజరైన వాళ్లపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిబ్బంది నవంబర్ 30న కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని.. మెటీరియల్‌ను తీసుకొని పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. డిసెంబర్ 1న ఉదయం 7.00 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించాలన్నారు.
ఇవీ చూడండి: ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా అనుమతించొద్దు: లోకేష్ కుమార్