చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లాలో గంగ పుత్రులు ఆందోళన చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాఘవపూర్ గ్రామ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. వెంటనే మంత్రి పదవి నుంచి తలసానిని తొలగించాలని గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ముదిరాజు కులస్తులకు చేపలు పట్టే హక్కు కల్పించ వద్దని కోరారు. సంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులను అవమానపరిచిన తలసాని తన మాటలు వెనక్కి తీసుకుని... బెస్త కులస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై వెనక్కి తగ్గని రైతులు