సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని కూడవెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండపాక, తోగుట మండలాల నుంచి వస్తున్న వరదల కారణంగా రాత్రి నుంచి వాగులు, చెక్ డ్యాములన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఉన్నట్లుండి పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, వంకలను చూస్తూ గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ అందాలను వీక్షించేందుకు చెక్ డ్యామ్ వద్దకు చేరుకుంటున్న గ్రామస్థులు సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. కూడవెల్లి వాగు నిండుకుండలా ప్రవహిస్తుండటంతో... సంవత్సరం పొడవునా వ్యవసాయం కోసం నీళ్ల సమస్య ఉండదని పరిసర ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు