సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన బస్వరాజు రాజశేఖర్‌కు గత 20 రోజుల క్రితం కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే సరికి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వెళ్లాడు. చికిత్స చేయించుకొని కోలుకున్నాడు. చికిత్స నిమిత్తం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. తన ఆర్థిక స్తోమత అంతగా బాలేకపోయినప్పటికీ... ప్రాణాలు కాపాడుకునేందుకు అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నాడు.
విషయం తెలుసుకున్న స్నేహితులు, ఆత్మీయులు స్నేహితుడి కోసం నిధులు సేకరించడం మొదలుపెట్టారు. వివిధ గ్రామాలకు చెందిన స్నేహితులకు కూడా విషయం తెలిపారు. ఎవరికి తోచినంత వారు సాయం చేయడంతో మొత్తం 1,79,800 రూపాయలు జమ అయింది. జమ అయిన మొత్తం విరాళాన్ని నేడు మిత్ర బృందం రాజశేఖర్‌కు అందించారు. విరాళాల సేకరణకు కృషిచేసిన పెసరు సుధాకర్, చుక్క శంకర్లను తోటి మిత్ర బృందం అభినందించింది. కష్ట కాలంలో మిత్రులు చూపిన ఔదర్యానికి రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం