సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందో లేక నిజాం రాజ్యం నడుస్తోందో అర్థం కావడంలేదని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి అన్నారు. ప్రభుత్వ ఆసుప్రతిలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన మహిళా మోర్చా నాయకురాళ్లపై డిజాస్టర్ మేనేజ్‌మోంట్ యాక్ట్ కింద కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రోజూ లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిలో ఎంతమందిపై కేసులు పెట్టి కోర్టులో హాజరుపరుస్తున్నారో చెప్పాలని విజయ శాంతి అన్నారు. పీపీఈ కిట్ ధరించకుండా గాంధీ, ఎంజీఎంలో తిరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి... ఖర్చు పరిమితిని రూ. 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా నిర్వహించాలి: డీజీపీ