త్వరలో కోమటి చెరువులోకి గోదావరి నీళ్లు రానున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఫీడర్ కాలువ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఫీడర్ కాలువ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ వెంట కాలినడకన 2 కిలో మీటర్ల మేర పనులను పరిశీలించారు.
తడ్కపల్లి, ఎన్సాన్పల్లి చెరువులు నిండిన నేపథ్యంలో.. ప్యాకేజీ 12 నుంచి త్వరలోనే కోమటి చెరువుకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కోమటి చెరువు కాలువ ద్వారా నర్సాపుర్ చెరువుకు నీళ్లు వస్తాయని తెలిపారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దగ్గరుండి పనులు పూర్తి చేయించాలని ఛైర్మన్ రాజనర్సుకు సూచించారు.
ఇదీచూడండి: జగిత్యాల స్ఫూర్తితో ‘జలహితం'.. సిరిసిల్లలో ప్రారంభించనున్న కేటీఆర్