దేశంలో అడవులు పునరుజ్జీవ కార్యక్రమం తొలిసారిగా తెలంగాణలోనే చేపట్టినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్ధిపేట శివారులో నాగులబండ వద్ద రూ.4.3 కోట్లతో ఏర్పాటుచేసిన అర్బన్ పార్కును ఆయన ప్రారంభించారు. సుమారు ఐదు వందల ఎకరాల్లో పార్కును ఏర్పాటుచేయగా.. 50 ఎకరాలు ఆక్సిజన్ పార్కుకు కేటాయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో 109 అర్బన్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు హరీశ్‌రావు. సిద్ధిపేట పార్కుతో కలిసి.. 35 పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
నాగులబండ అర్బన్ పార్కులో రెండు నెలల్లో మూషిక జింకలు వదులుతామని హరీశ్ తెలిపారు. సాహస క్రీడలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పిల్లలు ఆడుకునేందుకు వసతులు కల్పించామన్నారు.
పట్టణాలు, గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు పదిశాతం బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి హరీశ్ గుర్తుచేశారు.
ఇవీచూడండి: 'వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేయొచ్చా?'