సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈనెల 11న ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం చేతుల మీదుగా పలు ప్రగతి పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సమీకృత కార్యాలయ భవనంలో ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జేసీ పద్మాకర్లు నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులను జారీ చేయాలని సూచించారు. మహతి ఆడిటోరియంలో సీఎం... ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున సమావేశానికి వచ్చేవారికి ముందస్తు పాసులు జారీ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: మిషన్ భగీరథ లీకేజీ... రోడ్డుపైకి చిమ్ముతున్న నీరు