సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని కొత్తకోట గ్రామంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పర్యటించారు. పేదలు, వెనకబడిన వర్గాల కోసం తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తున్న బీమా పథకం కార్యకర్తలకు ఎంతో ధీమాగా ఉంటుందని అయన పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన తెరాస కార్యకర్త గుంటూరు శంకర్ కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలిక ఛైర్మన్ రాజమౌళి, జగదేవ్పూర్ఎంపీపీ బాలేశంగౌడ్, ఆత్మ అధ్యక్షుడు రంగారెడ్డి, కొండపోచమ్మ ఆలయ పాలక మండలి అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ