సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రైతు మిత్ర సొసైటీ ఎదుట యూరియా కోసం ఉదయం నుంచి రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వారం రోజులుగా తిరుగుతున్నామని.. ఇవాళ వచ్చిందని తెలియగా ఉదయం నుంచి సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిండి తిప్పలు లేకుండా ఇక్కడ క్యూలో నిలబడ్డామని.. అయినా తమ వరకు యూరియా అందుతుందో లేదోనని రైతులు వాపోయారు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి.. తమకు కొరత లేకుండా సక్రమంగా అందేలా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పట్టణంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా ప్రజలెవరూ అస్సలు పట్టనట్లున్నారని.. సొసైటీ వద్ద భౌతిక దూరం పాటించట్లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందన్నారు.
ఇదీ చదవండిః కేంద్ర వ్యవసాయ బిల్లులపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి