ETV Bharat / state

నిర్మాణ పనులు ఆపేయాలని రైతుల ఆందోళన.. అరెస్టులతో ఉద్రిక్తం - Farmers are protest to stop the canal at siddipeta news

తమ భూముల నుంచి మల్లన్న సాగర్​కి వెళ్లే కాలువ నిర్మాణ పనులు చేపట్టవద్దని రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే కాలువ నిర్మాణ పనులు నిలిపివేయాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అడ్డుకోగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

farmers-are-protest-to-stop-the-canal-at-siddipeta-news
కాలువ నిర్మాణ పనులు చేపట్టవద్దని రైతులు ఆందోళన
author img

By

Published : Jan 11, 2021, 5:40 PM IST

మల్లన్న సాగర్​కి వెళ్లే కాలువ నిర్మాణం పనులను నిలిపివేయాలని సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. బురుగుపల్లి గ్రామం వద్ద గ్రామ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నిరసనను పోలీసులు అడ్డుకోగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

కాలువ మార్గాన్ని ఒక చోట మరొక చోటుకు మారుస్తున్నారని వారు ఆరోపించారు. కాలువ నిర్మాణం గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. ఈ విషయం తెలిసి ఒక రైతు గుండెపోటుతో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు సీపీఎం, కాంగ్రెస్, భాజపా నాయకులు మద్ధతు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: రానున్న నెలల్లో 30కోట్ల మందికి టీకా: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.