వ్యవసాయ బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
నిబంధనల ప్రకారం బోరుబావి.. బోరుబావికి మధ్య 100 మీటర్ల దూరం పాటించకుండా రమేశ్ అనే రైతు బోరు వేశాడని.. అతని వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న మరో అన్నదాత ఫిర్యాదు చేశాడు. తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు బోరును సీజ్ చేశారు. మనస్తాపానికి గురైన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఇదీ చూడండి: ప్రజల పురోగతికి కట్టుబడి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం: గవర్నర్