సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. సన్నరకం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియంత్రిత సాగుపేరుతో సన్నరకం పండించమని చెప్పిన సర్కారు... ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
అనంతరం ఏవోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించి ఇబ్బంది పెట్టొద్దు'