ETV Bharat / state

అబద్ధాలు చెప్పడంలో నెంబర్​వన్​ సీఎం కేసీఆర్: డీకే అరుణ - సిద్దిపేట జిల్లా తాజా సమాచారం

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నిక భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం వల్ల తెరాస దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఉపఎన్నికలో భాజపాను గెలిపించి, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

election compaign in Dubbaka sub election by DK Aruna
అబద్ధాలు చెప్పడంలో నెంబర్​వన్​ సీఎం కేసీఆర్: డీకే అరుణ
author img

By

Published : Oct 28, 2020, 4:53 PM IST

అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలో ఆమె పర్యటించారు. ఉపఎన్నికలో భాజపా గెలుపు ఖాయమని సర్వేలో తేలిందని ఆమె అన్నారు.

భాజపా గెలుస్తుందన్న నిజం జీర్ణించుకోలేని అధికార పక్షం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దుబ్బాకలో భాజపాను గెలిపించి, కేసీఆర్​కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రధాని మోదీ వల్ల పేదలకు పక్క రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కట్టిస్తే తెలంగాణలో రెండుపడక గదుల సంగతి మరిచిపోయారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే దుబ్బాకలో భాజపాను గెలిపించాలని ప్రజలను డీకే అరుణ కోరారు.

ఇదీ చూడండి:ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులు: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.