ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షం.. అయినా ఆగని తెరాస ప్రచారం - వానలోనూ తెరాస ఎన్నికల ప్రచారం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సుజాత రామలింగారెడ్డి వర్షంలోనూ ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ప్రజల ముందుకు వచ్చిన తనను ఆశీర్వదించాలని దౌల్తాబాద్​ మండల ప్రజలకు సుజాత విజ్ఞప్తి చేశారు.

trs candidate election campaigning in rain  at dubbaka
ఎడతెరిపి లేని వర్షం.. అయినా ఆగని తెరాస ప్రచారం
author img

By

Published : Oct 13, 2020, 4:07 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత దౌల్తాబాద్​ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ వర్షంలోనూ ప్రచారానికి బోనాలు, బతుకమ్మలతో ప్రజలు హాజరై.. వారికి ఘన స్వాగతం పలికారు. అనారోగ్యంతో రామలింగారెడ్డి మరణించినా.. ఆయన ఆశయాలను బతికించేందుకే తాను ప్రజల్లోకి వచ్చినట్లు సుజాత తెలిపారు.

తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోలిపేట సుజాత ప్రచారం చేశారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా గాజులపల్లి, దొమ్మాట, సూరంపల్లి గ్రామాల్లో మెదక్​ ఎమ్మెల్యే పద్మ దేవేందర్​ రెడ్డి, మున్సిపల్​ ఛైర్మన్​ ప్రతాప్​రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

ఇదీ చదవండి : మధిరలో ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.