ETV Bharat / state

దుబ్బాక డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన బాట పట్టారు. నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని నోటిసులు ఇచ్చినా కనీస స్పందన లేదన్నారు.

దుబ్బాక డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన
author img

By

Published : Sep 23, 2019, 7:34 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్​ డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2017 నుంచి ఉన్న బకాయిలు చెల్లించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, నూతన బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

దుబ్బాక డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ఇవీ చూడండి: '​శాసన మండలిని ముఖ్యమంత్రి అగౌరవ పరిచారు'

Intro:దుబ్బాక బస్ డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన.

Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని స్థానిక బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

ఆందోళనలో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటీయూసీ, టిఎంయు మరియు ఇతర సంఘాల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గడచిన పదిహేను రోజుల నుండి ఆర్టీసీ సమ్మెకు పిలుపు ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా 4 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని1). కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను కేటాయించాలని2). ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలని 3). 2017 నుండి పే స్కేలు ఇవ్వాలని 4). ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది అంటున్నారు ఆర్టీసీ కార్మికులు 100% పని చేస్తున్నది ప్రభుత్వానికి తెలియడం లేదా, అలా అయితే డీజిల్ మీద వ్యాట్ తీసుకోకండి, 10% రోడ్డు టాక్స్ తీసివేయండి అని అన్నారు.

ఆర్టీసీలో ఇప్పటివరకు 6 వేల మంది రిటైర్డ్ అయిన కొత్తవారిని తీసుకోలేదని, ఉన్నవారే పనులు చేస్తున్నామని, ఇలా చేయడం వల్ల అధిక పని గంటలు భరించలేక పని వత్తిడితో అనేక మంది డ్రైవర్లు మరియు కండక్టర్లకు విధుల్లో నే హార్ట్ ఎటాక్ వస్తుంది అని, ప్రభుత్వం ఎలాగైనా స్పందించాలని తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోతే తమ ఆందోళనలను తీవ్రతరం చేసి ఇ నిరవధిక దీక్ష చేపడతామని అన్నారు.

Conclusion:ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో దుబ్బాక ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముందు ఆందోళన చేపట్టారు, ఈ ఆందోళనలో వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని లేనిపక్షంలో నిరవధిక దీక్ష చేపడతామని తెలిపారు.

కిట్ నంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.