వరిసాగుపై కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా... సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి భాజపా పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (MLA Raghunandan Rao)ను హైదరాబాద్‌లోని తన నివాసంలో నార్సింగి పోలీసులు గృహనిర్బంధం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఎన్ని నిర్భందాలు విధించినప్పటికీ... కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Raghu nandan rao: కలెక్టర్ మాటలు... శాసన వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి
వేడెక్కిన 'వరి' రాజకీయం... భాజపా, తెరాస సవాళ్లు, ప్రతి సవాళ్లు!
BJP Leader Premender Reddy : 'మంత్రి హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి'