ETV Bharat / state

శ్రీవారి సన్నిధిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు - శ్రీవారి సేవలో ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాకలో గెలుపొందిన ఎమ్మెల్యే రఘునందన్​రావు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు అర్పించిన తరువాత దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. దుబ్బాక గెలుపు భాజపా విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. తన గెలుపు కోసం కష్టపడిన అందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు.

dubbaka mla raghunandan rao in tirumala tirupati devasthanam
శ్రీవారి సన్నిధిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు
author img

By

Published : Nov 11, 2020, 2:01 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో గెలుపొందిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపఎన్నికల్లో విజయం అనంతరం కుటంబ సమేతంగా నేరుగా తిరుమలకు వచ్చిన ఆయన... స్వామివారికి తలనీలాలను సమర్పించారు. అనంతరం సుపథం మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారనీ... ఆయన ఆశయాల అమలుకోసం పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. దుబ్బాక గెలుపుని తమ పార్టీ విజయమన్న రఘనందన్... తన గెలుపు కోసం కష్టపడిన అందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. రఘనందన్ రావు వెంట భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

శ్రీవారి సన్నిధిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు

ఇదీ చదవండి: దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.