ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం దుబ్బాక నుంచే ప్రారంభమైందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు తెరాస కార్యకర్తలు.. ఎమ్మెల్యే సమక్షంలో భాజపాలో చేరారు.
కొండపోచమ్మ జలాశయానికి గండ్లు పడి గ్రామాల్లోకి నీరు వచ్చినా... కేసులు పెట్టనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నిజాం కాలం నుంచి పోరాటాలు మొదలుపెడితే నేటి వరకు ప్రజలు పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాకతోపాటు గజ్వేల్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు.
ఇదీ చదవండి:ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు: సీఎస్