ETV Bharat / state

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం

author img

By

Published : Nov 10, 2020, 5:00 AM IST

Updated : Nov 10, 2020, 6:37 AM IST

ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు.. లెక్కింపు కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. 23 రౌండ్లలో ప్రక్రియ కొనసాగనుండగా.. మూడు గంటల్లోనే ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం
మరికొన్ని గంటల్లో తేలిపోనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నెల 3న జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్​లో లెక్కింపు చేపట్టనున్నారు. 850 మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి.. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మొదట అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తి చేసి.. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణిస్తారు.

పొరపాట్లకు తావివ్వకుండా..

ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా నిబంధనల మేరకు సిబ్బంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్​ను నియమించడంతో పాటు.. ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేయనున్నారు. రౌండ్ లెక్కింపు పూర్తికాగానే ఎన్నికల సంఘం వెబ్ సైట్​లో వివరాలు నమోదు చేయనున్నారు.

ఏడు సెక్టార్లుగా భద్రతా ఏర్పాట్లు..

గత అనుభవాల దృష్ట్యా లెక్కింపు సందర్భంగా బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. లెక్కింపు కేంద్రం, పరిసరాలను ఏడు సెక్టార్లుగా విభజించి భద్రతా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట పట్టణ, శివారు ప్రాంతాల్లో 10 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూం, లెక్కింపు కేంద్రం వద్ద స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. లెక్కింపు సమయంలో.. ఫలితం అనంతరం నాయకులు, కార్యకర్తలు గొడవలకు పాల్పడకుండా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ స్వయంగా బందోబస్తు పర్యవేక్షించనున్నారు.

ఇదీ చదవండి: 'మార్పు' పవనాల మధ్య కౌంటింగ్​కు బిహార్​ సిద్ధం

Last Updated : Nov 10, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.