ETV Bharat / state

దుబ్బాకలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు.. గెలుపెవరిదో?

author img

By

Published : Oct 7, 2020, 5:01 AM IST

Updated : Oct 7, 2020, 6:23 AM IST

దుబ్బాక.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన వేళ... గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయం ఎవరిదనే అంశం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటికే తెరాస, భాజపా అభ్యర్థులను ప్రకటించి కదనరంగంలో దూకగా.. కాంగ్రెస్ నేడు అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. అటు నామినేషన్ల గడువు సమీపిస్తుండడంతో... పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి.

dubbaka by election fight in siddipeta district
దుబ్బాకలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు.. గెలుపెవరిదో?
దుబ్బాకలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు.. గెలుపెవరిదో?

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు దుబ్బాకలో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. భిన్న ప్రణాళికలతో ఉపఎన్నికకు సన్నద్దం అవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందే ఎన్నికల బాధ్యులను ప్రకటించి.. క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఇప్పటికే తెరాస, భాజపా తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశముంది. లక్ష ఓట్ల అధిక్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తెరాస అందరికంటే ముందుగానే ప్రచారం ప్రారంభించింది. అభ్యర్థి పేరు ప్రస్తావన లేకుండానే కారు గుర్తుకే ఓటు వేయాలంటూ క్షేత్రస్థాయిలో నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రతి మండలానికి ఓ ఎమ్మెల్యేను బాధ్యునిగా నియమించారు. ఎమ్మెల్యే పర్యవేక్షణలో ప్రతి వంద మంది ఓటర్లకు ఓ ఇంఛార్జిని నియమించారు.

తెరపైకి పలువురి పేర్లు

వీరంతా గత పదిహేను రోజులుగా వారికి కేటాయించిన మండలాలు, గ్రామాల్లోనే బస చేస్తూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.తెరాస టికెట్ రామలింగారెడ్డి కుటుంబానికే ఇస్తారన్న సంకేతాలున్నప్పటికీ.... పలువురి పేర్లు తెర మీదికొచ్చాయి. ఆశావహులు తమ అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వద్ద ప్రయత్నించారు. పార్టీ మాత్రం దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత వైపే మొగ్గు చూపింది. మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా సుజాత ఇంటికి వెళ్లి.. ముఖ్యమంత్రి సందేశాన్ని అందించారు.

శ్రీనివాస్‌రెడ్డికే టికెట్​!

తమ ఒకనాటి కంచుకోటను తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క వంటి ముఖ్యనేతలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పజెప్పారు. బూత్‌లెవల్ స్థాయిలోనూ కీలక నాయకులను పర్యవేక్షకులుగా నియమించారు. పలువురు నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించిన అధిష్ఠానం... స్థానికంగా మంచి ఆదరణ ఉన్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది. తెరాసలో ఉన్న ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ప్రకటన లాంఛనప్రాయమే కానుంది.

గెలుపే లక్ష్యంగా భాజపా ప్రణాళికలు

అటు దుబ్బాకలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఉపఎన్నికలో విజయం సాధించి... రాష్ట్రంలో అధికార తెరాసకు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలివ్వాలన్న లక్ష్యంతో భాజపా ఉంది. నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి అప్పగించడంతో పాటు... మండలాల వారీగా ముఖ్య నేతలను సమన్వయకర్తలుగా నియమించారు. టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో నియోజకవర్గవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన రఘునందన్‌రావును.... పార్టీ మంగళవారం అభ్యర్థిగా ఖరారు చేసింది. గత 20 రోజలుగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న రఘునందర్‌రావు... అసంతృప్తితో ఉన్న తెరాస, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ.... బలం పుంజుకుంటున్నారు. నామినేషన్ల దాఖలు తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

ఇదీ చదవండి: తిరుగులేని ముంబయి.. రాజస్థాన్​పై ఘన విజయం

Last Updated : Oct 7, 2020, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.