ETV Bharat / state

'దుబ్బాకలో కాంగ్రెస్​ విజయం సాధించడమే లక్ష్యం' - దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు తాజా వార్తలు

గాంధీభవన్​లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్​, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ... పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలని.. కార్యకర్తలకు సూచించారు.

Dubbaka Assembly elections Review in gandhi bhavan
'ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించడమే లక్ష్యం'
author img

By

Published : Sep 22, 2020, 9:08 PM IST

రాష్ట్రంలో త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా అనుబంధ సంఘాలు పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శులు.. పార్టీ అనుబంధ సంఘాలకు స్పష్టం చేశారు.

గాంధీభవన్​లో ఇవాళ జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్​, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర‌ రాజనర్సింహ... పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఎన్నికల సందర్భంగా తెరాస ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని వాటిని జనంలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తెరాస గెలిస్తే ఒరిగేది ఏమీలేదని...ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య మాత్రమే పెరుగుతుందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు అవుతుందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నారు.

ఇదీ చూడండి:కేటీఆర్​ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.