ETV Bharat / state

చివరి అంకానికి ప్రచారం... ఏర్పాట్లలో అధికార యంత్రాంగం - సిద్దిపేట వార్తలు

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడనుండటంతో... గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు పోలింగ్‌కు మరో 2రోజులే సమయం ఉన్నందున అధికారులు ఏర్పాట్లలో నిగమ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటుచేశారు.

చివరి అంకానికి చేరుకున్న ప్రచారం... ఎర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

author img

By

Published : Nov 1, 2020, 7:09 AM IST

చివరి అంకానికి ప్రచారం... ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాంత్మకంగా మారిన దుబ్బాక ఉపఎన్నిక ప్రచార గడువు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రధాన పార్టీల నేతలు... ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార తెరాస, భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రభుత్వ పథకాల నిధులపై తెరాస, భాజపాల మధ్య ఇప్పటికే హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా చేస్తున్న 11ఝూటా ప్రచారాలపై తాను సంధించిన ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానమివ్వకుండా తప్పించుకుంటున్నారని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. నిజామాబాద్‌లో ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తామన్న ఆ పార్టీ నేతలు... వెయ్యి అబద్ధాలతోనైనా దుబ్బాకలో డిపాజిట్‌ కోసం శ్రమిస్తున్నారన్నారు.

మీరు నిరూపించండి... నేను ఉరేసుకుంటా

మరోవైపు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర నేతలంతా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ నిధులపై ప్రజలకు వివరిస్తూ.... అధికార పార్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే దుబ్బాక నడిబొడ్డున తాను ఉరేసుకుంటానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలంతా నియోజకవర్గంలో పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధంపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

ఈ నెల 3న దుబ్బాక ఉపఎన్నికకు పోలింగ్‌ జరగనున్నందున... అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలతో... అన్ని వర్గాల వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఓటు హక్కు సౌకర్యవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ బందోబస్తు నడుమ

ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా నేటి నుంచి నెలరోజుల పాటు జిల్లావ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌-1861 అమల్లో ఉంటుందని ఇంఛార్జీ ఎస్పీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు.

ఇదీ చూడండి: రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.