వేసవి తాపంతో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. తాగునీటి సౌకర్యాలు ఉన్నా ప్రజలకు అందించలేక అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలోని జ్యోతి రామ్ తండాలో తాగునీటి కోసం మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్‌ను నిర్మించారు. నీటిని విడుదల చేసే గేటు వాల్వు వారంరోజుల కిందట చెడిపోగా... మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.
స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఈ విషయమై సంప్రదిస్తే సిబ్బందికి చెప్పానని అంటున్నారని, మూడు నెలలుగా తమకు జీతాలు లేవని సిబ్బంది అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంక్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని వాపోయారు. తమ తండాలో 20 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా బాధితుల కోసం ఐపీఎల్ జీతమిచ్చేసిన క్రికెటర్