ETV Bharat / state

చేగుంటలో 500 మంది ఆటో డ్రైవర్లకు కిరాణా సామగ్రి పంపిణీ

సిద్దిపేట జిల్లాలోని చేగుంట మండలంలో ఆటో డ్రైవర్లకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. నిత్యం రోడ్ల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే ఆటో డ్రైవర్లకు లాక్ డౌన్ వల్ల ఉపాధి కరవైందన్నారు ఎమ్మెల్యే.

ఆటో డ్రైవర్లకు కిరాణా సామగ్రి పంపిణీ
ఆటో డ్రైవర్లకు కిరాణా సామగ్రి పంపిణీ
author img

By

Published : Apr 21, 2020, 12:02 PM IST

సిద్దిపేట జిల్లా చేగుంట మండలంలో 500 మంది ఆటో కార్మికులకు నిత్యవసర వస్తువులను దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ ఛైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి పంపిణీ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల లాక్ డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో సామాన్య, పేద ప్రజలు కనీస అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో ఉపాధి లేక అల్లాడుతున్న 500 మంది ఆటో కార్మికులకు మండల తెరాస ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బియ్యం అందించారు.

ఆటో డ్రైవర్లను తప్పక ఆదుకుంటాం...

లాక్ డౌన్ వల్ల కూలీ చేసుకుని బతికే వారి జీవనం ఆగమైందని..అలాంటి వారిని తప్పక ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. పేదలకు మేమున్నామంటూ సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సమాజంలో ఆటో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని... గ్రామాల్లో అత్యవసర సేవలకు 108 ఎలాగో ఆటో డ్రైవర్లు కూడా అలాగే సేవలు అందిస్తారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, తెరాస మండల అధ్యక్షుడు వెంగల్ రావు, ఎమ్మార్వో విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.