ETV Bharat / state

Komuravelli Mallanna Brahmotsavam : కోలాహలంగా కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం - Komuravelli Mallanna jatara

Komuravelli Mallanna Brahmotsavam : భక్తుల కొంగు బంగారం కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆసక్తికర ఘట్టం పెద్ద పట్నం కార్యక్రమాన్ని.. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున నిర్వహించారు. రాత్రంతా శివనామస్మరణతో జాగారం చేసిన భక్తులు.. పెద్ద పట్నం తొక్కేందుకు ఉత్సాహం కనబరిచారు.

Komuravelli Mallanna Brahmotsavam
కొమురవెల్లిలో పెద్ద పట్నం
author img

By

Published : Mar 2, 2022, 8:15 AM IST

Updated : Mar 2, 2022, 9:01 AM IST

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో కోలాహలంగా పెద్ద పట్నం

Komuravelli Mallanna Brahmotsavam : భక్తుల కొంగు బంగారం కోరమీసాల కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, శివసత్తులు పెద్ద పట్నం తొక్కేందుకు పోటీపడ్డారు కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం పెద్దపట్నంతో ముగిసింది.

కోలాహలంగా సాగిన పెద్దపట్నం

Komuravelli Mallanna Pedda Patnam : సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఇవాళ తెల్లవారుజామున స్వామివారి పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందుగా గర్భాలయంలో లింగోద్భవ కాలంలో స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను కొమురవెల్లి పురవీధుల్లో భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఊరేగించారు. తదుపరి తోట బావి వద్ద పెద్ద పట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు మూడు గంటలకు పైగా ఒగ్గు కళాకారులు పంచ వర్ణాలతో పెద్ద పట్నాన్ని వేశారు. రాత్రంతా జాగారాలు చేసిన భక్తులు పెద్ద పట్నాన్ని తొక్కేందుకు ఉత్సాహం కనబర్చారు. ముందుగా ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం దాటారు. అనంతరం భక్తులకు అనుమతించడంతో ఒక్కసారిగా పట్నంలోకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వారిని క్రమ పద్ధతిలో పంపించారు.

ఉగాది వరకు

కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. మూడు నెలల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగుతాయి.

ఇదీ చదవండి: Maha Shivratri 2022 : శంభో శివ శంభో.. శివశివ శంభో

Last Updated : Mar 2, 2022, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.