సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టిన హారీశ్‌రావు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక పెద్దమ్మ దేవాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ హల్‌ను, కొత్త గ్రామ పంచాయితీ భవనాన్ని, మహిళా సమాఖ్య భవనాన్ని, యాదవ సంఘ భవనాన్ని ప్రారంభించారు. మున్ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుందామని గ్రామస్థులకు వివరించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో సిద్దిపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఇవీ చూడండి: నా తమ్ముడు దాడి చేయలేదు: ఎమ్మెల్యే కోనప్ప