సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే ఉపఎన్నికకు శుక్రవారంతో నామినేషన్ గడువు పూర్తయింది. మొత్తం 46 మంది నామినేషన్ వేయగా 103 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గురువారం ఒక్కరోజే.. 18 మంది నామినేషన్‌దాఖలు చేశారు. ఇందులో 14 మంది స్వతంత్ర అభ్యర్థులున్నట్లు ఎన్నికల అధికారి చెన్నయ్య వెల్లడించారు.
మరోపక్క దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రస్థాయి నేతలు.. దుబ్బాకలో మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. విమర్శలు.. ప్రతివిమర్శలతో దుబ్బాక నియోజకవర్గం హోరెత్తుతోంది.
ఇదీ చదవండి: దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం