ETV Bharat / state

కల్తీ డీజిల్​తో పాడైన వాహనాలు... వినియోగదారుల ఆందోళన

ప్రస్తుత సమాజంలో ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఏదో రూపంలో కల్తీ బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా తీసుకుని కల్తీ డీజిల్​ను విక్రయించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఇండీజెల్​ బంకు నిర్వాహకులు. ఈ విషయాన్ని గమనించిన వాహనదారులు బంకు ఎదుట ఆందోళనకు దిగారు.

Damaged vehicles with adulterated diesel  Consumer concern in husnabad siddipeta dist
కల్తీ డీజిల్​తో పాడైన వాహనాలు..... వినియోగదారుల ఆందోళన
author img

By

Published : Dec 2, 2020, 9:06 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కల్తీ డీజిల్​ విక్రయిస్తున్న బంకు ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. కల్తీ ఇంధనం వాడకం వల్ల తమ వాహనాలు రెండు నెలలకే పాడైపోయాయని రైతులు, వినియోగదారులు వాపోయారు. పట్టణంలోని ఇండిజెల్ పెట్రోల్​ బంకులో ఈ కల్తీ బాగోతం బయటపడింది.

రెండు రూపాయలు తక్కువకు వస్తుందన్న కారణంతో ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు మోసపోయామని తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్​ చేశారు. కల్తీ డీజిల్​ విక్రయిస్తున్న దుకాణ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తహాసీల్దార్​కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య తెలిపారు.

ఇదీ చూడండి:ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం: హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.