కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని గాంధీ విగ్రహం ముందు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని జిల్లా కార్యవర్గ సభ్యుడు జి. భాస్కర్ విమర్శించారు. మూడు నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యక్తికి 10 కిలోల ఆహారధాన్యాల చొప్పున... ఆరు నెలలపాటు ఉచితంగా అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్, ప్రశాంత్, మల్లేశం, కార్మికులు జయమ్మ, భాగ్యలక్ష్మి, రాజమణీ, సునీత, శ్యామల, సుశిత, సుజాత పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రతిరోజూ గ్రామం శుభ్రం కావాల్సిందే: కేసీఆర్