ETV Bharat / state

కేంద్రం కార్పొరేట్​ శక్తులకు ఊడిగం చేస్తోంది: చాడ - Chada response on central agricultural bills

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని.. చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్​ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

cpi-state-secretary-chada-venkat-reddy-serious-on-central-government
కేంద్రం కార్పొరేట్​ శక్తులకు ఊడిగం చేస్తోంది: చాడ
author img

By

Published : Sep 28, 2020, 7:53 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో వ్యతిరేకించిన తెరాస పార్టీ.. ప్రజా క్షేత్రంలో ఎందుకు వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆర్​.ఎస్​.ఎస్​. సిద్ధాంతాలను, మత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని చాడ విమర్శించారు. ప్రత్యక్ష పెట్టబడుల్లో విదేశీ కంపెనీలకు అవకాశం కల్పించి.. కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళారులు, వ్యాపారులు సిండికేట్ కావడం వల్ల కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందని.. దీనివల్ల రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టంతోనూ రైతుల బతుకులు రోడ్డున పడి.. చివరికి వారికి ఉరి తాళ్లు మిగులుతాయని అన్నారు. ఈ చట్టం వల్ల విద్యుత్ రంగం కేంద్రం గుప్పిట్లోకి వెళ్లి రాష్ట్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారుతాయని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎల్.ఆర్.ఎస్. విధివిధానాలపై సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని చాడ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్​.ఆర్.ఎస్​. వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం పడనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇదీచూడండి: పోలీసుల నిర్లక్ష్యంతోనే హేమంత్​ హత్య: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.