సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామంలో పరీక్షలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తొగుట జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి తీసుకెళ్లారు.
స్పందించి కొవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని పంపిచడంతో హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి జడ్పీటీసీ ఇంద్రాసేనా రెడ్డి, సర్పంచ్ రజిత కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో కరోనా పరీక్షల నిర్వహణను డీఎంహెచ్‌ఓ మనోహర్ పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు..!