సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలోని జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని హుస్నాబాద్ - సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు.
దీనితో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పత్తి కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: 'జాలర్ల వలలో పీఎస్ఎల్వీ రాకెట్ బూస్టర్'