ETV Bharat / state

పోలీసుల ఆధ్వర్యంలో కరోనాపై దృశ్యరూపక అవగాహన - సిద్దిపేటలో దృశ్యమాధ్యమంగా కరోనా అవగాహన

సిద్దిపేట సీపీ ఆదేశానుసారం మిరుదొడ్డి మండలంలో ప్రచార రథం ద్వారా దృశ్య రూపకంగా కరోనావైరస్​ నివారణ, నియంత్రణపై పోలీసులు అవగాహన చేపట్టారు. ప్రముకులు తెలిపిన సందేశం, ఐసీఎంఆర్​ నిబంధనలనలు ప్రజలకు ఎల్​ఈడీ స్క్రీన్​ ద్వారా చూపించారు.

Corona awareness program as a visual in the presence of police in Miruddi, Sidipet
కరోనాపై దృశ్యరూపక అవగాహన
author img

By

Published : Jul 22, 2020, 2:25 PM IST

సిద్దిపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీ ఆదేశానుసారం మిరుదొడ్డి మండలంలో కరోనా ప్రచార రథం ద్వారా పలు గ్రామాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వైరస్​పై ప్రజలకు దృశ్య రూపక అవగాహన కల్పించారు. రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, కరోనా నివారణకు తెలిపిన జాగ్రత్తలను, ఐసీఎం ఆర్ నియమ నిబంధనలను, మహమ్మారిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన సందేశాన్ని ప్రజలకు వివరణాత్మకంగా చిత్ర రూపకంగా చూపించారు.

ఈ కార్యక్రమాన్ని మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ కరోనా వైరస్ నివారణకు, నియంత్రణకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బయటకు వెళ్లినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని ఎస్సై సూచించారు.

ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.