సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సహకార పోరులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. 13 డైరెక్టర్ స్థానాల్లో 12 స్థానాల వరకు సమఉజ్జీగా తెరాస, హస్తం అభ్యర్థులు కొనసాగారు.
ఉత్కంఠ భరితంగా సాగిన 13వ వార్డు లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందగా.. ఏడు స్థానాలతో హస్తం సింగిల్ విండో ఛైర్మన్ పీఠం చేజిక్కించుకుంది.
కాంగ్రెస్ శ్రేణులు లెక్కింపు కేంద్రం వద్ద సంబురాలు చేసుకున్నారు. అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు.
- ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్