కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విజయశాంతికి హితవు పలికారు. 'కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత సేపు కోవర్టులు కనిపించలేదా? పార్టీ నుంచి వెళ్తున్నప్పుడే కోవర్టులు కనిపించారా?' అని ఆమెను ప్రశ్నించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీలో ప్రచార కమిటీ ఛైర్మన్ కావాలంటే అదృష్టం ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి.. యూత్ కాంగ్రెస్, పీసీసీ పదవులు అనుభవించిన తనకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి రాలేదన్నారు. అలాంటి విజయశాంతి పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు. భాజపా నాయకులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై మోజు తీరిందని.. ఇక విజయ శాంతి లాంటి వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని హనుమంత రావు ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: రైతన్నల పోరాటానికి మద్దతుగా నిలిచిన మంత్రులు, తెరాస శ్రేణులు