ETV Bharat / state

'ప్రతీ పెదవాడి మనసులో వైఎస్సార్ పదిలం' - ysr jayanthi news

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ప్రతీ పేద వాడి మనసు గెలిచిన మహానేత వైఎస్సారని నాయకులు కొనియాడారు.

congress leaders tribute to ys rajashekar reddy in husnabad

author img

By

Published : Jul 8, 2020, 3:30 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్​తో హుస్నాబాద్ ప్రాంతానికి ఎనలేని సంబంధాలు ఉన్నాయని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి గుర్తు చేశారు.

హుస్నాబాద్ రైతుల కోసం వైఎస్సార్​ వరద కాలువకు శంకుస్థాపన చెయ్యడంతోపాటు గౌరవెల్లి- గండిపల్లి ప్రాజెక్టుకు బీజం వేశారన్నారు. ఆయన పాలనలో చేపట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి అనేక సంక్షేమ పథకాలు చిరస్మరణీయంగా మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రతీ పేద వాడి మనసు గెలిచిన మహానేత వైఎస్సార్​ అని నాయకులు కొనియాడారు.

ఇవీచూడండి: పత్తికి 'తెలంగాణ బ్రాండ్‌'!.. మార్కెటింగ్ శాఖ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.