సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ వినూత్న నిరసనకు దిగింది. గుంతల్లో తెరాస జెండాలు పాతారు. అసలే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు హుస్నాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించి సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ కోరారు. తెరాస పార్టీ జెండాలను పాతినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్