సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసితులకు ఇచ్చిన నష్ట పరిహారం విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నాలుగేళ్ల నుంచి గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పంపింగ్ స్విచ్చింగ్ యంత్రాలను హుస్నాబాద్‌లోని కిరాయి గృహంలో ఉంచి తుప్పు పట్టిస్తున్నారని ఆరోపించారు. వాటిని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డికి టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
పంపింగ్ వ్యవస్థ పరికరాలు తుప్పుపట్టిపోయాయని, ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బొమ్మ శ్రీరామ్ అన్నారు. వెంటనే ఆ యంత్ర పరికరాలను వెనక్కి పంపించటం లేదా ఉపయోగించాలని తెలిపారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇచ్చిన నష్ట పరిహారం విషయంలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కరోనా కట్టడిలో సర్కారు విఫలం: బండి సంజయ్