సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న భాజపా కార్యకర్తపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తెరాసలో చేరుతున్నారంటూ దుష్ప్రచారం చేశారని పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ ఆరోపించారు.
తప్పుడు ప్రచారానికి పాల్పడిన భాజపా మండల ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తితో కలిసి పోలీసులను కోరారు. అతని చర్య వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. వీరితో పాటు కౌన్సిలర్ వల్లపు రాజు, రాజిరెడ్డి, బొంగోని శ్రీనివాస్, బురుగు కిష్టస్వామి, పున్న సది, గుగులోతు రాజు పాల్గొన్నారు.