దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెబితేనే.. నిర్లక్ష్యపు పాలన నుంచి కేసేఆర్ మేలుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా.. ప్రగతిభవన్, ఫాంహౌస్ నుంచి బయటకు రాని ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు.
దుబ్బాక ఎన్నికల ముందు ఉద్యోగులకు డీఏ, మక్కలను ప్రభుత్వమే కొంటుందని ప్రలోభాలకు గురిచేస్తున్నారని పొన్నాల విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలతో అవలంభిస్తున్నారని మండిపడ్డారు.