ETV Bharat / state

దుబ్బాక గెలుపే లక్ష్యంగా మండల ఇంఛార్జ్​లను ప్రకటించిన కాంగ్రెస్ - దుబ్బాక ఎన్నిక కోసం మండల ఇంఛార్జిలను నియమించిన కాంగ్రెస్

దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఆ దిశగా మండల ఇంఛార్జ్​లను ప్రకటించింది. ఒక్కో మండలానికి సీనియర్ నాయకులను నియమించింది.

దుబ్బాక గెలుపే లక్ష్యంగా మండల ఇంఛార్జిలను ప్రకటించిన కాంగ్రెస్

author img

By

Published : Oct 5, 2020, 10:26 PM IST

Updated : Oct 6, 2020, 11:28 AM IST

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నిమిత్తం కాంగ్రెస్‌ పార్టీ మండల ఇంఛార్జ్​లను ప్రకటించింది. ఎనిమిది మండలాలకు ప్రాధాన్యత క్రమంలో ముఖ్యనాయకులను ఇంఛార్జ్​లుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియమించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను ఇంఛార్జ్​లుగా నియమించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు.

ఉత్తమ్, రేవంత్, సీతక్క...

దుబ్బాక మండలానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డిలు ఉన్నారు. మిర్దొడ్డి మండలానికి ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌; సురేష్‌షెట్కార్‌, శ్రీశైలం గౌడ్‌లను నియమించారు.

తోగుట మండలానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములనాయక్‌, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌లను నియమించారు. దౌల్తాబాద్‌ మండలానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, మహేశ్ కుమార్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్‌లను నియమించారు.

భట్టి, వీహెచ్...

రాయిపోలె మండలానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, సీనియర్‌ నేత చంద్రశేఖర్‌, సంజీవ్‌ రెడ్డిలు, చేగుంట మండలానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత వి.హనుమంతురావు, పొన్నం ప్రభాకర్‌, కుసుమకుమార్‌, కేఎల్‌ఆర్‌లను నియమించారు. నర్సింగి మండలానికి పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్‌ షబీర్‌ అలీ, కైలాస్‌ శ్రీనివాస్‌లు, గజ్వేల్‌ మండలానికి మాజీ మంత్రి జె.గీతారెడ్డి, నాయిని యాద్గిరిలను నియమించారు.

ఇవీ చూడండి: ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి

Last Updated : Oct 6, 2020, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.