సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సై తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఓ కారు కనిపించింది. అందులో 9 సంచుల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని ఏసీపీ మహేందర్ తెలిపారు.
దావరవేని నారాయణరావు అనే వ్యక్తి బీదర్ నుంచి భూపాలపల్లి జిల్లా టేకుమట్లకు గుట్కా తరలిస్తున్నట్లు సీపీ తెలిపారు. కారును సీజ్ చేసి, నారాయణరావుతోపాటు అతని సహాయకుడు నారేండ్ల చందు, కార్ డ్రైవర్ కుంభం రమేశ్‌లను అరెస్టు చేశామన్నారు. గుట్కాను పట్టుకున్న ఎస్సై సుధాకర్‌తోపాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత