సిద్దిపేట జిల్లా చింతమడకలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పర్యటించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నూతంగా నిర్మించ తలపెట్టిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. చింతమడకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్థులతో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఆర్డీవో, ఎమ్మార్వో, సర్పంచి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి నుంచి కనీస ఛార్జీ - రూ.10