ETV Bharat / state

గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం.. మాట నిలబెట్టుకున్న సీఎం - telangana news

CM KCR visited Komuravelli Mallanna temple: కొమురవెల్లి మల్లన్నను సీఎం కేసీఆర్​ దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్​ వద్ద మల్లన్న సాగర్​ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం.. కేసీఆర్​ కొమురవెల్లి ఆలయానికి చేరుకున్నారు. గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేశారు.

cm kcr visited komuravelli mallanna temple
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్​
author img

By

Published : Feb 23, 2022, 4:36 PM IST

Updated : Feb 23, 2022, 5:26 PM IST

CM KCR visited Komuravelli Mallanna temple: గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్​ అభిషేకం చేశారు. ప్రతిష్ఠాత్మక మల్లన్న సాగర్​ ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆ జలాలతో మల్లన్న పాదాలు కడుగుతామని గతంలో కేసీఆర్​ ప్రకటించినట్లుగా.. ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ప్రాజెక్టును ప్రారంభించి కోరమీసాల మల్లన్న స్వామికి జలాభిషేకం చేశారు.

గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేసిన సీఎం కేసీఆర్‌

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరమీసాల కొమురవెల్లి మల్లన్నను ముఖ్యమంత్రి కేసీఆర్​ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల నడుమ మల్లన్న సాగర్​ జలాలను ఆలయానికి తీసుకువచ్చారు. స్వామి వారికి కేసీఆర్​ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేయించారు. దర్శనానంతరం సీఎంకు అర్చకులు ఆశీర్వాచనాలు అందజేశారు. మల్లన్నసాగర్‌ ఎత్తిపోతలను.. కేసీఆర్​ జాతికి అంకితం చేశారు.

ఇదీ చదవండి: చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్​

Last Updated : Feb 23, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.