ETV Bharat / state

KCR: నేడు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్​ పర్యటన - సీఎం కేసీఆర్ తాజా వార్తలు

సిద్దిపేట కలెక్టరేట్, పోలీస్ కమిషనర్ కార్యాలయాలను.. పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కొత్త జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)... ఇక్కడి నుంచి నాంది పలకనున్నారు. సిద్దిపేటలో పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కామారెడ్డికి వెళ్లనున్నారు.

cm-kcr-tour-in-siddipeta kamareddy
KCR: నేడు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్​ పర్యటన
author img

By

Published : Jun 20, 2021, 3:44 AM IST

Updated : Jun 20, 2021, 8:30 AM IST

కొత్త జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్ల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సిద్దిపేట నుంచి మొదలుపెట్టనున్నారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి పర్యటన ఈ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది. మొదటగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని.. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు. చివరగా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్‌లోనే కేసీఆర్ సమావేశం కానున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిద్దిపేట సీపీతో పాటు సూర్యాపేట, వికారాబాద్‌ల ఎస్పీలు సైతం... సీఎం పర్యటన బందోబస్తులో పాల్గొంటున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 1500మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గోనున్నారు. కేసీఆర్ పర్యటన ముగిసే వరకు.. రాజీవ్ రహదారితో పాటు సిద్దిపేటలో ట్రాఫిక్ అంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనాన్ని పరిశీలించే అవకాశం ఉంది.

కామారెడ్డి జిల్లాలో సైతం

సీఎం కేసీఆర్(CM KCR) కామారెడ్డి పర్యటన కోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్న కేసీఆర్.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ సిద్దిపేటలో పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కామారెడ్డికి రానున్నారు.

మొదట జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభించిన తర్వాత.. సమీకృత కలెక్టరేట్​ను ప్రారంభించనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్నారు. కేసీఆర్ పర్యటన కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పూర్తి పచ్చదనం సంతరించుకునేలా ఎక్కడికక్కడ మొక్కలు నాటారు. అధికారులు సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి పట్టణంతోపాటు తిరుగు ప్రయాణంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మిక తనిఖీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Unlock: ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాల్సిందే

Last Updated : Jun 20, 2021, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.