ETV Bharat / state

ఆధునిక హంగులతో 'కేసీఆర్​ నగర్​'.. ప్రారంభించనున్న సీఎం - సీఎం కేసీఆర్​ సిద్దిపేట పర్యటన

సంపన్నవర్గాలకు తీసిపోని విధంగా ఇండ్లు.. సకల సౌకర్యాలతో గృహసముదాయం.. గేటెడ్‌ కమ్యూనిటీని తలపించే నిర్మాణాలు. పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి గ్యాస్‌.. నిరంతరం తాగునీరు, విద్యుత్‌ సరఫరా.. ఇవి పేదలకు కేసీఆర్‌ సర్కారు అందిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల ప్రత్యేకత. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. సిద్ధిపేటలో రేపు కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైన 2,460 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం... సకల సౌకర్యాలతో అబ్బురపరుస్తోంది.

cm kcr launches double bed room house in siddipeta tomorrow
ఆధునిక హంగులతో 'కేసీఆర్​ నగర్​'.. ప్రారంభించనున్న సీఎం
author img

By

Published : Dec 9, 2020, 5:04 PM IST

ఆధునిక హంగులతో 'కేసీఆర్​ నగర్​'.. ప్రారంభించనున్న సీఎం

పేదల చిరకాల వాంఛ సొంత గూడు. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా. పొద్దంతా కూలీ నాలి చేసుకుని వచ్చి తలదాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు స్థలాల్ని కొనుక్కోవడమే గగనం. కానీ...ప్రభుత్వం వారి కలల్ని నెరవేరుస్తోంది. సంపన్నవర్గాల ఇళ్లను తలదన్నేలా రెండు పడక గదుల ఇళ్లను కట్టించి ఇస్తోంది. గేటెడ్‌ కమ్యూనిటీని తలపించేలా, అందమైన అపార్ట్‌మెంట్ల మాదిరిగా అత్యున్నత ప్రమాణాలతో గృహ సముదాయాల్ని నిర్మించింది. సకల సౌకర్యాలు , అన్ని హంగులతో పేదలకు ఇంటి భాగ్యం కల్పిస్తోంది.

సకల సౌకర్యాలతో..

45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 163 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 2వేల 460 ఇండ్లను నిర్మించింది. 205 బ్లాక్‌లకు గాను ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్లు ఉన్నాయి. జీ+2 పద్ధతిలో నిర్మించిన భవనాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఇంటికి 24 గంటల తాగునీరు, పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ కనెక్షన్‌, విద్యుత్‌ సదుపాయం, సమీకృత మార్కెట్‌ యార్డు, మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్‌ భగీరథ సంప్‌, పిల్లల ఆటస్థలం, పార్కు...ఇలా ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పించారు. పచ్చదనం పరుచుకునేలా గ్రీనరీ, అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్లు ఇచ్చామా లేదా అన్నది కాకుండా... ఒక అధునాతన కాలనీలో ఉండే సదుపాయాలన్నీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు.

సకల హంగులతో తీర్చిదిద్దిన ఈ రెండు పడక గదుల ఇళ్లలో పైపు ద్వారా గ్యాస్‌ సరఫరా చేయటం మరో ప్రత్యేకత. పేదలకు పంపిణీ చేసే ఇళ్లలో పైపు ద్వారా గ్యాస్‌ సరఫరా చేయటం ఇక్కడే ప్రథమం. నల్లా తిప్పితే నీళ్లు వచ్చినట్లుగానే... నాబ్‌ తిప్పగానే గ్యాస్‌ వస్తుంది. ఈ విధానం వల్ల సిలిండర్‌ ద్వారా వాడుతున్న గ్యాస్‌ కంటే 15 నుంచి 20 శాతం వరకు ఆదా కానుంది. ప్రతి ఇంటికి పైపు ద్వారా గ్యాస్‌ సరఫరా చేసేందుకు ఈ భవనాల సముదాయంలోనే డిస్ట్రిబ్యూటింగ్‌ రెగ్యులేటరీ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ల ద్వారా వినియోగాన్ని లెక్కగట్టి...రెండు నెలలకోసారి బిల్లు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు.

సామూహిక గృహప్రవేశాలు..

ఆధునిక హంగులతో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయానికి ‘కేసీఆర్‌ నగర్‌'గా నామకరణం చేశారు. గురువారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ గృహ సముదాయంలో 144 మంది సామూహిక గృహప్రవేశాలు చేయనున్నారు. పేదరికం కారణంగా కిరాయి ఇండ్లలోనే కాలం వెళ్లదీస్తున్న ఎంతో మంది లబ్ధిదారులు... ఈ ఇండ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇళ్లను కేటాయించిన తర్వాత నిర్వహణ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి: సిరిసిల్ల ఆసుపత్రిలో నూతన సదుపాయాలు ప్రారంభించిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.