లాక్డౌన్ సమయంలో పేదలు తిండికి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 55 శాతం ఉచిత బియ్యం సరఫరా పూర్తయింది. ఈ మేరకు రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాలను సివిల్ సప్లై ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం బియ్యం పంపిణీ పూర్తయిందని తెలిపారు. ఏప్రిల్ 15 కల్లా బియ్యం పంపిణీ పూర్తి చేస్తామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ సమయంలో పేదలు, వలస కార్మికులు ఆకలితో బాధ పడవద్దని సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు.