సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు. బంద్‌లో పట్టణంలోని వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హోటళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు పట్టణంలో ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా చేర్యాల డివిజన్ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం